Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (24/07/2022)

ఈ రోజు ఎవరి రాశి ఫలం ఎలా ఉందంటే?

Updated : 24 Jul 2022 05:17 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

కార్యసిద్ధి ఉంది. భోజన సౌఖ్యం కలదు. బుద్ధిబలంతో తోటివారి మనస్సును గెలుచుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ  సందర్శనం శుభప్రదం.

శుభ సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ  దైవారాధన మానవద్దు.

మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి, మంచి జరుగుతుంది.

మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. శ్రీవిష్ణు నామస్మరణ ఉత్తమం.

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు.ఇష్టదేవతాస్మరణ శుభాలను చేకూరుస్తుంది. 

ఒక వ్యవహారంలో పెద్దల సహకారం అందుతుంది. ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్ధికంగా శుభఫలితాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.

శ్రమ ఫలిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. కలహాలు సూచితం. తోటివారిని కలుపుకొనిపోవడం ఉత్తమం. గణేశ అష్టోత్తర శతనామావళి చదివితే  సమస్యలు తొలగుతాయి.

 ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధు,మిత్రులను ఆదరిస్తారు. కానీ, వాళ్లు  మిమ్మల్ని నమ్మంచి మోసం చేసే అవకాశం ఉంది. అనవసర అంశాల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించకండి. ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి. శ్రీలక్ష్మీ అష్టోత్తరం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. పెద్దలను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. దుర్గాదేవిని ఆరాధన శుభకరం. 

 

చేపట్టిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆంజనేయ స్తోత్రం చదివితే బాగుంటుంది.

ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. లలితా సహస్రనామ పారాయణ శుభకరం. 

మంచి కాలం. ఆర్థికంగా విజయం సాధిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. రాజదర్శన సల్లాపాలు, భోజన సౌఖ్యం లభిస్తాయి. శివాష్టకం చదివితే మంచి జరుగుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని