ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-03-2022)

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-03-2022)

Updated : 29 Feb 2024 16:13 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. నిరుత్సాహాన్ని విడనాడాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది.

ప్రారంభించిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి. శివ ఆరాధన శుభకరం.

ప్రారంభించిన పనులను దైవానుగ్రహంతో వాటిని సమర్థంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను అందుకుంటారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.
 

మీలోని పోరాట పటిమ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శ్రీ వెంకటేశ్వర దర్శనం శుభప్రదం.

భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. తోటివారితో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సూర్య ఆరాధన శుభప్రదం.

 ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. స్థిరమైన నిర్ణయాలతో  మేలైన ఫలితాలు సాధిస్తారు. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు సాగాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభఫలదాయకం.

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

చేపట్టే పనుల్లో సంతృప్తికర ఫలితాలను సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

 

ముఖ్య విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. శత్రువుల జోలికి పోకుండా ఉండటం మంచిది. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గణపతి సందర్శనం శుభప్రదం.

ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని విషయాల్లో ఊహించిన దాని కన్నా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. శ్రీరామ దర్శనం ఉత్తమం.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అనుకూలమైన సమయం. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహకారంతో ఒక ముఖ్య వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. శ్రీ రామ నామాన్ని జపించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని