Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/02/2024)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.   

Published : 19 Feb 2024 00:04 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మనోధైర్యం  మిమ్మల్ని సదా కాపాడుతుంది. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. భవిష్యత్తును దృష్టిలోపెట్టుకుని ముందడుగు వేయండి . శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

చేపట్టే పనిలో ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది.  కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది.  ఒక సంఘటన ఆనందాన్నిస్తుంది.  ఆదిత్య హృదయం పఠిస్తే బాగుంటుంది.

ఒక శుభవార్త వింటారు. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది.  బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు.  శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది.

శారీరక శ్రమ పెరుగుతుంది కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శని ధ్యానం చేయాలి.

శుభకాలం. బుద్ధిబలాన్నేపెట్టుబడిగా లాభాలను అందుకుంటారు. బంధుమిత్రుతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండండి. దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం వల్ల  మంచి జరుగుతుంది.

ధర్మసిద్ధి ఉంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అర్థలాభం కలదు. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. దుర్గ స్తోత్రం పఠించాలి.

తలపెట్టిన కార్యాన్ని పూర్తిచేస్తారు. ఉద్యోగ పరంగా అనుకూలంగా  ఉంది. మితంగా ఖర్చుచేయాలి. శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబసభ్యుతో ప్రేమగా మెలగాలి. సాయి నామాన్ని స్మరించండి.

మీ మీ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించేవిధంగా ముందుకుసాగాలి. కుటుంబసభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం మంచిది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది.  నవగ్రహ శ్లోకాలు  చదవాలి.

ధర్మ సిద్ధి ఉంది. ఏ  పని తలపెట్టినా యిట్టె పూర్తవుతుంది. కొన్ని కీలక వ్యవహారాలను వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి.  ప్రసన్నాంజనేయ సోత్రం పారాయణ చేయాలి.

 

సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు.  ఆలోచించి ఖర్చుపెట్టాలి. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది.

కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మనోధైర్యంతో  పనులను పూర్తిచేస్తారు. ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకొని పోతే ఇబ్బందులు ఉండవు. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగుతాయి.

మీకిది శుభకాలం. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో  అభివృద్ధికి సంబందించిన వార్త వింటారు.  ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం పఠించాలి.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని