Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/02/2024)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది.  డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 14 Feb 2024 00:33 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మీ మీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. అందరినీ కలుపుకొనిపోవడం ఉత్తమం. శ్రీసూక్తం విన్నా, చదివినా మంచి ఫలితాలు సాధిస్తారు.

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులు కొంటారు. మీ పై అధికారులు మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.

అనుకూల ఫలాలు ఉంటాయి. స్థిర నిర్ణయాలతో మంచి ఫలితాలు సాధిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణ సౌఖ్యం ఉంది. పంచముఖ ఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

అభివృద్ధికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే సంఘటనలు చోటుచేసుకుంటాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది.  

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అవసరానికి డబ్బు అందుతుంది.  అష్టమ చంద్ర బలం అనుకూలించటంలేదు.  ప్రారంభించబోయే పనుల్లో అనుకున్నదాని కన్నా ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. శ్రీహరిని ఆరాధిస్తే మంచిది.

ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. సమయోచితంగా స్పందించండి. ముఖ్య వ్యహారాల్లో లౌక్యం అవసరం. శ్రీలక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.

ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల కాలం. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో  కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. లింగాష్టకం చదివితే బాగుంటుంది.

అనుకూల సమయం కాదు. మీ మీ రంగాల్లో వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్త. అనవసర కలహం సూచితం. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శనిజపం అనుకూలతను ఇస్తుంది.

దైవబలం రక్షిస్తోంది. ముఖ్య విషయాల్లో తొందరపాటు వద్దు. ప్రారంభించిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక సంబంధ సమస్యలు తొలగి కుదురుకుంటారు. ఒక సంఘటన కనువిప్పు కలిగిస్తుంది. ఖర్చులను తగ్గించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే బాగుంటుంది..

 

బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులను మధ్యాహ్నకాలంలో ప్రారంభించండి. అనుకూల ఫలితాలు సాధిస్తారు. స్థిరమైన ఆలోచనలు మేలు చేస్తాయి. గణపతి అష్టోత్తరం చదివితే బాగుంటుంది.

ముఖ్యమైన పనులను కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. దుర్గాదేవి, శ్రీవేంకటేశ్వరుడిని పూజిస్తే శుభఫలితాలు వస్తాయి.  

ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. బుద్దిబలం బాగుండటం వల్ల కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు పొందుతారు.శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని