Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/02/2024)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 18 Feb 2024 00:28 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది. 

మంచిపనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం. 

భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివనామస్మరణ ఉత్తమం. 

కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. ఈశ్వర సందర్శనం శుభప్రదం. 

శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు  మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం చదవాలి.

మిశ్రమకాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటీ రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా  ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. చంద్రధ్యానం శుభప్రదం. 

బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుడు మాటలను వినకండి. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.

మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం చదవడం శుభప్రదం. 

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులు కొంటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి జరుగుతుంది .

 

ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బంది పడతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బంది పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది.

మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని