Health News: నిద్ర పట్టడం లేదా? మంచి నిద్రకు మార్గాలివే!

ఒక రోజు నిద్ర పోకపోతే తల్లడిల్లి పోతాం. కంటికి విశ్రాంతి లేకుండా పోయిందని బాధపడుతాం.

Updated : 18 Apr 2022 15:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక రోజు నిద్ర పోకపోతే తల్లడిల్లి పోతాం. కంటికి విశ్రాంతి లేకుండా పోయిందని బాధపడతాం.. నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. ఎలాగైనా మంచి నిద్ర పోవాలని ఆరాట పడతాం. కొంతమంది ఏకంగా నిద్ర మాత్రలను కూడా ఆశ్రయిస్తారు. చక్కని సుఖనిద్రకు ఏం చేయాలో తెలుసుకుందాం. 

చక్కని నిద్రకు ఏం చేయాలి: నిద్ర సంపూర్ణంగా పోతే శరీరం శక్తి కూడ గట్టుకుంటుంది. కొత్త ఉత్సాహం వస్తుంది. కంటి నిండా కమ్మటి నిద్రకు ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి

* రోజూ ఒకే సమయానికి నిద్రకు ఉపక్రమించాలి. శరీరంలోని నిద్ర, మెలకువ చక్రం సర్దుకొని రాత్రిపూట బాగా నిద్ర పట్టేలా చేస్తుంది.

* కడుపునిండా తిని, ఆకలిగా ఉన్నప్పుడు నిద్రించకూడదు.

* ద్రవాలను ఎక్కువగా తీసుకుంటే మధ్యలో లేవాల్సి రావొచ్చు.

* నిద్ర పోవడానికి ముందు సిగరెట్లు, కాఫీల జోలికి వెళ్లొద్దు.

రోజూ పడక మీదకు చేరక ముందు స్నానం చేయడం, పుస్తకం చదవడం, సంగీతం వింటే శరీరం నిద్రకు సన్నద్ధం అవుతుంది.

* టీవీ, కంప్యూటర్లు, సెల్‌ఫోన్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి.

* పడక గది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. మంచం, పరువు సౌకర్యంగా ఉండాలి.

* పగటి పూట నిద్ర పోవద్దు. ఎక్కువ సేపు నిద్ర పోతే రాత్రిపూట నిద్ర పట్టదు. మధ్యాహ్నం అరగంటకు మించి నిద్రపోకుండా చూసుకోవాలి.

* రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది గాఢనిద్రకు దారి తీస్తుంది. కాసేపట్లో నిద్ర పోతామనగా వ్యాయామం చేయకూడదు.

* ఒత్తిడికి దూరంగా ఉండాలి. పని, మానసిక ఒత్తిడి నిద్రను దూరం చేస్తాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని