Lockdown: కేరళలో ఉచితంగా ఫుడ్‌ కిట్స్‌ పంపిణీ

కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్రంలో మే 8 నుంచి 16 వరకూ రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ అమలుచేస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

Published : 08 May 2021 16:46 IST

తిరువనంతపురం: కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్రంలో మే 8 నుంచి 16 వరకూ రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ  ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. లాక్‌డౌన్‌ నుంచి ఆహారం, కిరాణా, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపల దుకాణాలు, పౌల్ట్రీ, పశువుల కుట్టి దుకాణాలు, బేకరీలు, రేషన్‌ షాపులకు మినహాయింపు ఇచ్చారు. ఈ సందర్భంగా లాక్‌ డౌన్‌లో ఎవరికీ ఆహార కొరత ఉండదని ముఖ్యమంత్రి  భరోసా ఇచ్చారు. అన్ని కుటుంబాలకు ఉచితంగా ఆహార వస్తు సామాగ్రి పంపిణీ చేస్తామని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. అవసరమైన వాళ్లకు ఉచితంగా ఆహారాన్ని ఇంటికి వద్దకే డెలివరీ చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 11,744 కరోనా కేసులు నమోదు కాగా, 54 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకూ 14,161,77 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని