GATE 2023 Results: గేట్‌ ఫలితాలు విడుదల.. చెక్‌ చేసుకోండి..

GATE 2023 results: గేట్‌ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. స్కోర్‌ కార్డులను ఈ నెల 21 నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Published : 16 Mar 2023 18:53 IST

దిల్లీ: దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ప్రఖ్యాత ఇంజినీరింగ్‌ విద్యా సంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌- 2023(GATE-2023 Results) ఫలితాలు వెలువడ్డాయి. ఐఐటీ కాన్పూర్‌ నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను గురువారం సాయంత్రం అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్‌ చేసి ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. అయితే,  పెద్ద ఎత్తున అభ్యర్థులు ఒక్కసారిగా ఫలితాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించడంతో సాంకేతిక కారణాలతో సర్వర్‌లో సమస్యలు తలెత్తి అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

గేట్‌ పరీక్షలో సాధించిన  స్కోరుతో దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశంతోపాటు నెలనెలా ఉపకారవేతనం పొందొచ్చు. ఈ స్కోరు పీహెచ్‌డీ ప్రవేశాలకూ ఉపయోగపడుతుంది. కొన్ని పబ్లిక్‌, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాలకూ ఈ స్కోరు ప్రామాణికంగా తీసుకుంటుంటారు. ఇంత ప్రాముఖ్యమున్న గేట్‌ పరీక్షను ఈ ఏడాది కేంద్ర విద్యాశాఖ తరఫున 29 సబ్జెక్టుల్లో ఐఐటీ-కాన్పూర్‌ పరీక్ష నిర్వహించింది. గతేడాది ఆగస్టు 30 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్‌ 7వరకు కొనసాగింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 4,5 11,12 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. ఆన్సర్‌ కీని ఫిబ్రవరి 21న విడుదల చేసిన అధికారులు అభ్యంతరాల స్వీకరణకు 22 నుంచి 25 వరకు అవకాశం కల్పించారు. తాజాగా ఫలితాలను ప్రకటించిన అధికారులు.. స్కోర్‌ కార్డులు మాత్రం ఈ నెల 21 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని