హైదరాబాద్‌ ట్రాఫిక్‌ నిబంధనల్లో మార్పులు

మహానగరంలో ట్రాఫిక్‌ నియమ నిబంధనలను పోలీసు ఉన్నతాధికారులు మరింత కఠినతరం చేయనున్నారు. వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని త్వరలో కొత్త విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు.

Published : 15 Jan 2020 00:48 IST

హైదరాబాద్‌: మహానగరంలో ట్రాఫిక్‌ నియమ నిబంధనలను పోలీసు ఉన్నతాధికారులు మరింత కఠినతరం చేయనున్నారు. వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని త్వరలో కొత్త విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు. ఉల్లంఘనలకు పాల్పడే వారికి జరిమానాలు విధించడంతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించడం.. ప్రమాదాల్లో బాధితుల సంఖ్యను తగ్గించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల అధికారులు కసరత్తు చేస్తున్నారు. జంటనగరాల్లో ప్రస్తుతం ద్విచక్ర వాహనదారులు విధిగా శిరస్త్రాణం ధరించాలి. ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణిస్తే ఇద్దరూ శిరస్త్రాణం ధరించే విధంగా కొత్త విధానం అమలు చేసేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చెన్నై, బెంగళూరు తరహాలో నగరంలో కూడా ఈ నియమాన్ని తీసుకురానున్నారు. మూడు కమిషనరేట్లలో దశల వారీగా అమలు చేయనున్నారు. పురపాలక ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త నియమాన్ని అందుబాటులోకి తీసుకురావాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముందుగా ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించనున్నారు. మొత్తంగా మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో వాహనాలపై ప్రయాణించే ఇద్దరు శిరస్త్రాణం ధరించే విధంగా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని