ఏఎన్‌యూ విద్యార్థులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

‘జై అమరావతి’ నినాదాలు చేసినందుకుగానూ నలుగురు విద్యార్థులపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ) విధించిన సస్పెన్షన్‌ను యాజమాన్యం...

Updated : 03 Feb 2020 12:00 IST

అమరావతి: ‘జై అమరావతి’ నినాదాలు చేసినందుకుగానూ నలుగురు విద్యార్థులపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ) విధించిన సస్పెన్షన్‌ను యాజమాన్యం ఎత్తివేసింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం విద్యార్థి ఐకాస చేపట్టిన నిరసనలో ఈ నలుగురు విద్యార్థులు పాల్గొని రాజధానిపై నినాదాలు చేసినందుకు సస్పెన్షన్‌కు గురయ్యారు.

యూనివర్సిటీ ఎదుట విద్యార్థుల ధర్నా

యూనివర్సిటీ వీసీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఎన్‌యూ ఎదుట ఇవాళ విద్యార్థులు ధర్నాకు దిగారు. అమరావతి పరిరక్షణ విద్యార్థి యువజన ఐకాస నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. దీంతో యూనివర్సిటీ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని