సామాన్య భక్తుడిగా మేడారంలో కడియం

తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్తుల తాకిడి ఎక్కువైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా  బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. మరోవైపు తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి

Updated : 09 Aug 2022 11:29 IST

గోడ దూకి సమ్మక్కను దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం

మేడారం: తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్తుల తాకిడి ఎక్కువైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా  బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. మరోవైపు తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఓ సాధారణ భక్తుడిలా అమ్మవార్ల దర్శనానికి వెళ్లారు. క్యూలైన్‌లో నిల్చొని, గోడ దూకి సమ్మక్క గద్దెను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 7 సార్లు తన ఆధ్యర్యంలో జాతర నిర్వహించినట్లు గుర్తు చేశారు. వనదేవతల ఆశీర్వాదంతోనే తెలంగాణ సిద్ధించిందని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన 3 జాతరలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.315 కోట్లు  కేటాయించారని చెప్పారు. మేడారం జాతరను జాతీయపండగగా గుర్తించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని