కేకే ఎక్స్‌ అఫీషియో ఓటుపై హైకోర్టులో విచారణ

తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఎక్స్ అఫీషియో ఓటు వివాదంపై పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా

Published : 11 Feb 2020 16:51 IST

హైదరాబాద్‌: తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఎక్స్ అఫీషియో ఓటు వివాదంపై పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. కేశవరావు తెలంగాణలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని సవాల్ చేస్తూ తుక్కుగూడ మున్సిపాలిటీలోని ఎనిమిది మంది భాజపా కౌన్సిలర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ కోటాలో ఎన్నికైన కేశవరావు తుక్కుగూడలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేసేందుకు అనుమతించడం చట్టవిరుద్ధమని పిటిషన్‌లో భాజపా కౌన్సిలర్లు పేర్కొన్నారు.

మున్సిపాలిటీ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్‌పై చర్య తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇలాంటి వివాదాలను ఎన్నికల ట్రైబ్యునల్‌లో తేల్చుకోవాలని.. హైకోర్టుకు ఎందుకు వచ్చారని న్యాయస్థానం ఇరువర్గాలను ప్రశ్నించింది. రాష్ట్రంలో ఇంకా ఎన్నికల ట్రైబ్యునల్ ఏర్పాటు కాలేదని.. పిటిషనర్లు, రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు అందజేయాలని ఎస్ఈసీ తరఫు న్యాయవాదిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని