పీవీ సింధు సందేశం:వీడియో విడుదల చేసిన జగన్‌

ప్రభుత్వ శాఖల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. అవినీతిని అరికట్టేందుకు ఏర్పాటు...

Updated : 25 Feb 2020 16:35 IST

అమరావతి: ప్రభుత్వ శాఖల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. అవినీతిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన 14400 టోల్‌ఫ్రీ నంబర్‌పై ప్రచార వీడియోలను సీఎం విడుదల చేశారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు సందేశంతో ఈ వీడియోను విడుదల చేశారు. ‘ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అవినీతి రహిత సమాజం కోసం కృషి చేస్తున్నారు. ఎవరు అవినీతికి పాల్పడినా నిర్భయంగా మీ గొంతు వినిపించండి. వెంటనే 14400 అనే టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారమివ్వండి’ అని పీవీ సింధు వీడియో సందేశంలో పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, ఇసుక మాఫియాకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సీఎం జగన్‌ సూచించారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని సీఎం స్పష్టం చేశారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని