క్యాన్సర్‌ బాధితులకు కురుల దానం

ఇతరులను ఆదుకునేందుకు ఆస్తులు అంతస్తులేమీ అవసరం లేదు.. సాయం చేయాలన్న మంచి మనసుంటే చాలని తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌లోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థినులు మరోసారి నిరూపించారు. క్యాన్సర్‌ బాధితులకు తమ కురులను దానం చేసి...

Published : 07 Mar 2020 00:16 IST

కోయంబత్తూర్‌: ఇతరులను ఆదుకునేందుకు ఆస్తులు అంతస్తులేమీ అవసరం లేదు.. సాయం చేయాలన్న మంచి మనసుంటే చాలని తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌లోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థినులు మరోసారి నిరూపించారు. క్యాన్సర్‌ బాధితులకు తమ కురులను దానం చేసి శెభాష్‌ అనిపించారు. క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్న వారికి సహజంగా జుట్టు ఊడిపోతుంది. అలాంటి వారి కోసం విగ్గులు తయారు చేసేందుకు తమ జుట్టు ఉపయోగపడుతుందని సదరు విద్యార్థినులు చెబుతున్నారు. క్యాన్సర్‌ బాధితులను ఆర్థికంగా సాయం చేసే స్తోమత తమకు లేదని, అందువల్ల తమ జుట్టే వారికి ఎంతో కొంత సాయంగా నిలుస్తుందన్న ఆశతో దానం చేశామని వినోదిని అనే విద్యార్థిని మీడియాకు తెలిపారు.

ఇప్పటి వరకు 80 మంది విద్యార్థినులు తమ శిరోజాలను దానం చేసేందుకు రిజిస్టర్‌ చేసుకున్నారని, మరో 200 మందికిపైగా కురులను దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సదరు విద్యార్థిని చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. వాళ్ల ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని