ఆందోళన లేకుండా పరీక్షలు రాయండి

పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు

Updated : 18 Mar 2020 00:02 IST

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయండని సూచించారు. ఈ నెల 19 నుంచి ఏప్రిల్‌ 6 వరకు పదో తరగతి పరీక్షలు  నిర్విహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,34,903  మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు 2,530 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. పరీక్షల సందర్భంగా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. జలుబు, దగ్గుతో బాధపడే విద్యార్థులకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో శానిటైజర్లు ఉంచనున్నట్లు పేర్కొన్నారు. మాస్కులు, వాటర్‌ బాటిళ్లు తమ వెంట తీసుకురావడానికి అనుమతిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఇద్దరు చొప్పున వైద్య సిబ్బందిని ఉంచనున్నట్ల మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 24 గంటలు పనిచేసేలా కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏవైనా ఇబ్బందులపై కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 040 232290942కు ఫోన్‌ చేయాలని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని