ప్రియురాలి కోసం క్వారంటైన్‌ నుంచి జంప్‌

కొవిడ్‌-19 నియంత్రణకు లాక్‌డౌన్‌ పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నా కొందరికి పట్టడం లేదు. విదేశాల నుంచి వచ్చిన కొందరు సైతం క్వారంటైన్‌ కేంద్రాల నుంచి పారిపోతున్న....

Published : 27 Mar 2020 17:20 IST

మదురై: కొవిడ్‌-19 నియంత్రణకు లాక్‌డౌన్‌ పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నా కొందరికి పట్టడం లేదు. విదేశాల నుంచి వచ్చిన కొందరు సైతం క్వారంటైన్‌ కేంద్రాల నుంచి పారిపోతున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని ఓ యువకుడు ప్రియురాలి కోసం క్వారంటైన్‌ కేంద్రం నుంచి తప్పించుకుని వెళ్లడం కలకలం రేపింది. చివరికి అతడితో పాటు ప్రియురాలిని సైతం క్వారంటైన్‌ చేయాల్సి వచ్చింది.

తమిళనాడులోని మదురైకి చెందిన 24 ఏళ్ల యువకుడు ఇటీవల దుబాయ్‌ నుంచి రావడంతో క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. శివగంగ జిల్లాలో ఉన్న ప్రియురాలిని కలిసేందుకు క్వారంటైన్‌ కేంద్రం నుంచి అతడు తప్పించుకున్నాడు. దీంతో పోలీసులు, వైద్య సిబ్బంది అతడి కోసం ఉరుకులు పరుగులు పెట్టారు. చివరికి అతడిని ఆమె ప్రియురాలి ఇంట్లో గుర్తించారు. క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు అతడిపై కేసు నమోదు చేశారు. ప్రియురాలిని సైతం క్వారంటైన్‌కు తరలించాల్సి వచ్చింది. తమ ప్రేమకు ప్రియురాలి తల్లిదండ్రులు అంగీకరించకపోవడం వల్లే తాను తప్పించుకుని వెళ్లి ఆమెను కలవాల్సి వచ్చిందంటూ విచారణలో పోలీసులకు వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని