అత్యవసరాలకు ఏడు ప్రత్యేక వాహనాలు 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు అత్యవసర సమయాల్లో ఇబ్బందులు పడకుండా రాచకొండ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నడవక పోవడంతో మహీంద్రా లాజిస్టిక్స్‌తో కలిసి కమిషనరేట్‌ పరిధిలో.. 

Published : 08 Apr 2020 20:38 IST

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో అందుబాటులోకి.. 
హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు అత్యవసర సమయాల్లో ఇబ్బందులు పడకుండా రాచకొండ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నడవక పోవడంతో మహీంద్రా లాజిస్టిక్స్‌తో కలిసి కమిషనరేట్‌ పరిధిలో ఏడు ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. అత్యవసరం ఉన్నవారు కొవిడ్‌ కంట్రోల్‌ రూం నంబర్‌ 94906 17234కు ఫోన్‌ చేస్తే వాహనాన్ని పంపిస్తామన్నారు. దీంతోపాటు మద్యం లభించకపోవడంతో వింతగా ప్రవర్తిస్తున్న వారికోసం ప్రత్యేక మానసిక నిపుణుల బృందాన్ని నియమించారు. ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అయినా ప్రజలు లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని