నర్సీపట్నం వైద్యుడి సస్పెన్షన్‌

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి మత్తు వైద్య నిపుణుడు డాక్టర్‌ కె.సుధాకర్‌ను సస్పెండ్‌ చేయడంతోపాటు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెండురోజుల క్రితం ఆయన ప్రభుత్వం వైద్యుల బాగోగులను పట్టించుకోవడం లేదని, ఒక్కో మాస్క్‌ 15 రోజులు వాడమంటున్నారని వ్యాఖ్యలు చేశారు.

Updated : 09 Apr 2020 07:16 IST

నాలుగు సెక్షన్లతో కేసు నమోదు

నర్సీపట్నం, నర్సీపట్నం అర్బన్‌: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి మత్తు వైద్య నిపుణుడు డాక్టర్‌ కె.సుధాకర్‌ను సస్పెండ్‌ చేయడంతోపాటు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెండురోజుల క్రితం ఆయన ప్రభుత్వం వైద్యుల బాగోగులను పట్టించుకోవడం లేదని, ఒక్కో మాస్క్‌ 15 రోజులు వాడమంటున్నారని వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు వైద్యశాఖలో సంచలనం కలిగించగా, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఆయనపై మంగళవారం జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేశారు. బాధ్యతారహితంగా ప్రవర్తించడం, క్రమశిక్షణ లేకుండా అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనను సస్పెండ్‌ చేస్తున్నట్లు జిల్లా వైద్య విధాన పరిషత్తు (డీసీహెచ్‌ఎస్‌) నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆసుపత్రి పర్యవేక్షకురాలు నీలవేణిదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మత్తువైద్యుడు సుధాకర్‌పై నాలుగు సెక్షన్లతో కూడిన కేసు నమోదు చేశామని స్థానిక ఎస్సై టి.రమేష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని