ఆన్‌లైన్‌లో రాములోరి కల్యాణ తలంబ్రాలు

భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు భక్తులకు అందించేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తలంబ్రాలు కావాలనుకునే భక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించింది.. 

Updated : 17 Apr 2020 18:57 IST

హైదరాబాద్‌: భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు భక్తులకు అందించేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తలంబ్రాలు కావాలనుకునే భక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించింది. T App Folio యాప్‌ ద్వారా తలంబ్రాలు బుక్‌ చేసుకోవచ్చని దేవాదాయశాఖ వెల్లడించింది. ఒక కుటుంబానికి రెండు ప్యాకెట్ల చొప్పున బుక్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఒక్కో ప్యాకెట్‌ ధరను రూ. 20గా నిర్ణయించినట్లు దేవాదాయశాఖ అధికారులు వివరించారు. ఇప్పటికే 10 వేల మంది ఆన్‌లైన్‌లో తలంబ్రాల కోసం బుక్‌ చేసుకున్నారని.. బుక్‌ చేసుకున్నవారికి మూడు రోజుల్లోగా ఇంటికి పంపిస్తామన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని అశేషమైన భక్తుల జయజయధ్వానాల నడుమ జరగాల్సిన భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణం ఈ ఏడాది కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండానే ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో నిరాడంబరంగా జరిగిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని