వారిని కాపాడుకోవాలి

దేశంలో కరోనా మృతుల్లో వయోధికుల శాతం ఎక్కువగా ఉండటం ఆందోళనకరమని.. ఈ మహమ్మారి బారి నుంచి వారిని రక్షించేందుకు అన్ని చర్యలు ముమ్మరం చేయాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు, కరోనా కట్టడి చర్యల సమన్వయ బృందానికి నేతృత్వం వహిస్తున్న వీకే. పాల్‌ పేర్కొన్నారు...

Published : 24 Apr 2020 00:08 IST

నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌

న్యూదిల్లీ: దేశంలో కరోనా మృతుల్లో వయోధికుల శాతం ఎక్కువగా ఉండటం ఆందోళనకరమని.. ఈ మహమ్మారి బారి నుంచి వారిని రక్షించేందుకు అన్ని చర్యలు ముమ్మరం చేయాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు, కరోనా కట్టడి చర్యల సమన్వయ బృందానికి నేతృత్వం వహిస్తున్న వీకే పాల్‌ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశంలోని వృద్ధులంతా ప్రత్యేక వ్యక్తులు. మనం వారి బాగోగులు చూసుకోవాలి. ఒకవేళ వయోధికులు ఎవరైనా వైరస్‌ బారిన పడితే వీలైనంత త్వరగా వారిని గుర్తించి.. చికిత్స అందేలా చూడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని కాపాడుకోవాల’న్నారు. రోగనిరోధక శక్తి పెరిగేలా చ్యవన్‌ప్రాశ్‌, తులసి, దాల్చినచెక్క, మిరియాలు తినాలని సూచించారు. నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ మాట్లాడుతూ.. కరోనా కారణంగా దేశం సవాళ్లను ఎదుర్కొంటొందని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని