అలా అనడం సరికాదు..

కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి కోలుకొని ప్లాస్మా దానం చేస్తున్న కొందరు తబ్లిగీ జమాత్‌ సభ్యులను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ప్రశంసించారు. నేరపూరిత స్వభావంతో కొవిడ్‌-19 వ్యాప్తికి కారణమైన పాపం చేసిన మరికొందరు ‘కరోనా యోధులు’గా చెప్పుకోవడం సిగ్గుచేటని....

Published : 28 Apr 2020 15:35 IST

నేర స్వభావంతో పాపం చేసిన తబ్లిగీలు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు

కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ట్వీట్లు

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి కోలుకొని ప్లాస్మా దానం చేస్తున్న కొందరు తబ్లిగీ జమాత్‌ సభ్యులను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ప్రశంసించారు. నేరపూరిత స్వభావంతో కొవిడ్‌-19 వ్యాప్తికి కారణమైన పాపం చేసిన మరికొందరు ‘కరోనా యోధులు’గా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. 

కొవిడ్‌-19ను నయం చేసేందుకు శాస్త్రవేత్తలు, వైద్యులు వివిధ పద్ధతులను అవలంబిస్తున్నారు. ప్లాస్మా థెరపీ ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకొని శరీరంలో యాంటీ బాడీలు తయారైన వారు ప్లాస్మా దానం చేయాలని కోరగా పది మంది తబ్లిగీ జమాత్‌ సభ్యులు ముందుకు వచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలో నఖ్వీ రెండు ట్వీట్లు చేశారు.

‘నేర స్వభావంతో కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసి పాపం చేసిన కొందరు తబ్లిగీలు ఇప్పుడు కరోనా యోధులమని చెప్పుకుంటున్నారు. ఇది అద్భుతం... వాళ్లు చేసిన తప్పుకు సిగ్గుపడకుండా ఇప్పుడు లక్షలాది కరోనా యోధులను అవమానిస్తున్నారు. దీన్నే తప్పు చేసి గొప్పలు చెప్పుకోవడం (చోరీ ఔర్‌ సీనా జోరి) అంటారు’ అని నఖ్వీ ఒక ట్వీటులో అన్నారు. ‘నిజమే.. కొందరు దేశభక్తులైన భారతీయ ముస్లింలు అవసరమైనప్పుడు ప్లాస్మాదానం చేస్తున్నారు. కానీ వారందరినీ తబ్లిగీ అనడం సరికాదు. ప్రతి భారతీయ ముస్లింను తబ్లిగీగా నిరూపించేందుకు ప్రణాళికాబద్ధమైన కుట్ర జరుగుతోంది’ అని రెండో ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.

 తబ్లిగీ బృంద చర్యలను చాలామంది మైనారిటీలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఒక వర్గం చేసిన తప్పుకు అందరూ బాధ్యులు కారని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే.

చదవండి: ఐసీఎంఆర్‌ నిర్ణయంపై చైనా విచారం

చదవండి: కర్నూలులో 11 నెలల చిన్నారికి కరోనా


 


 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని