‘సామాజిక దూరం’ అనడం సరికాదు

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రజల మధ్య దూరం పాటించాలని చెబుతూ... దాన్ని ‘సామాజిక దూరం’ అనడం సరికాదని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది బి.కార్తిక్‌ నవయాన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Updated : 05 May 2020 09:01 IST

సుప్రీంకోర్టులో తెలంగాణ న్యాయవాది పిటిషన్‌

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రజల మధ్య దూరం పాటించాలని చెబుతూ... దాన్ని ‘సామాజిక దూరం’ అనడం సరికాదని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది బి.కార్తిక్‌ నవయాన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భౌతిక దూరం పాటించడాన్ని సామాజిక దూరంగా పరిగణించకూడదంటూ ఆయన ఈ-మెయిల్‌, రిజిస్టర్‌ పోస్టు ద్వారా లిఖితపూర్వక పిటిషన్‌ను సుప్రీంకోర్టుకు పంపారు. సామాజిక దూరం అనే బదులు భౌతిక దూరం, వ్యక్తిగత దూరం, డిసీజ్‌ డిస్టెన్సింగ్‌, సేఫ్‌ డిస్టెన్సింగ్‌ లేదా ఏదైనా కొవిడ్‌-19 గురించి తెలిపేలా పదాన్ని వాడాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని