గడ్డి అన్నారం మార్కెట్‌కు తాత్కాలిక సెలవు

గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌కు తాత్కాలిక సెలవులు ప్రకటించినట్లు మార్కెట్‌ కమిటీ వెల్లడించింది. రేపటి నుంచి మార్కెట్‌కు మామిడి తీసుకురావొద్దని రైతులను కమిటీ కోరింది. ఎవరైనా తెలియని రైతులు మామిడి తీసుకొస్తే సరూర్‌నగర్ రైతుబజారు

Updated : 12 May 2020 20:09 IST

హైదరాబాద్‌: గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌కు తాత్కాలిక సెలవులు ప్రకటించినట్లు మార్కెట్‌ కమిటీ వెల్లడించింది. రేపటి నుంచి మార్కెట్‌కు మామిడి తీసుకురావొద్దని రైతులను కమిటీ కోరింది. ఎవరైనా తెలియని రైతులు మామిడి తీసుకొస్తే సరూర్‌నగర్ రైతుబజారు వెనుక వీఎం హోమ్స్‌ మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్కెట్‌లో కొనుగోళ్లు నిర్వహిస్తామని కమిటీ పేర్కొంది. కోహెడ మార్కెట్‌ బంద్‌ కారణంగా గడ్డి అన్నారం మార్కెట్‌లో రద్దీ బాగా పెరిగిందని మార్కెట్‌ కమిటీ తెలిపింది. మార్కెట్‌ ప్రాంగణంలో భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. నిబంధనలు బేఖాతరు చేసిన 44 మంది కమీషన్ ఏజెంట్లపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసినట్లు కమిటీ వివరించింది. దీంతో రద్దీ దృష్ట్యా మార్కెట్‌కు తాత్కాలిక సెలవు ప్రకటించామని.. ఈ మేరకు రైతులకు సమాచారం అందించామని కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు రైతులు, కమీషన్‌ ఏజెంట్లు సహకరించాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. మార్కెట్‌ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామనేది ఉన్నతాధికారులు నిర్ణయిస్తారని ఏఎంసీ ఉన్నత శ్రేణి కార్యదర్శి యండ్రపల్లి వెంకటేశం తెలిపారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని