తీరాన్ని తాకిన అతి తీవ్ర తుపాను అంపన్‌

అతి తీవ్ర తుపాను అంపన్‌ పశ్చిమబెంగాల్‌లో తీరాన్ని తాకింది. భీకరగాలులతో ఇది దిఘా, హతియా దీవుల వద్ద తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సుమారు 4 గంటల పాటు తీరం దాటే ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ

Updated : 20 May 2020 16:31 IST

కోల్‌కతా: అతి తీవ్ర తుపాను అంపన్‌ పశ్చిమబెంగాల్‌లో తీరాన్ని తాకింది. భీకరగాలులతో ఇది మధ్యాహ్నం 2.30 గంటలకు తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సుమారు 4 గంటల పాటు తీరం దాటే ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలిపారు. బంగాల్‌-బంగ్లాదేశ్‌ మధ్య సుందర్బన్‌ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా బెంగాల్‌, ఒడిశా తీర ప్రాంతాల్లోని దాదాపు 4.5 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈ తుపాను కారణంగా ఇప్పటికే ఒడిశా, బంగాల్‌ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఆయా ప్రాంతాల్లో ఈదురుగాలుతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. తుపాను నేపథ్యంలో సముద్రంలో ఎగిసిపడుతున్న రాకాసి అలలు పశ్చిమ బంగాలోని తీర ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ మృంత్యుజయ మొహపాత్రా తెలిపారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 170-200 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను తీరం దాటాక గంటకు 110-120 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.  ఇది బంగ్లాదేశ్‌ వైపు వెళ్లాక తీవ్ర వాయుగుండగా మారనుంది. ఆ తర్వాత బలహీన పడనున్నట్లు అధికారులు తెలిపారు.

శాటిలైట్‌ పోన్లతో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు..
అతి తీవ్ర తుపాను అంపన్‌ బీభత్సం సృష్టిస్తుండటంతో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసినట్లు ఎన్టీఆర్‌ఎఫ్‌ డీజీ ఎస్‌.ఎన్‌. ప్రధాన్‌ తెలిపారు. ఒడిశా, బంగాల్‌లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. బంగాల్‌లో 19 ఒడిశాలో 20 బృందాలను మోహరించినట్లు వెల్లడించారు. తుపాను కారణంగా కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉండటంతో శాటిలైట్‌ ఫోన్లతో ఈ బృందాలు అనుసంధానమవుతాయని తెలిపారు.

ఇదీ చదవండి..

‘అంపన్‌’ ఎక్కడుంది.. ఎటు వెళ్తోంది?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని