రంగులు తొలగించమన్నాం కదా?:ఏపీ హైకోర్టు

గ్రామ పంచాయతీ కార్యాలయాల రంగుల అంశంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్‌ 623ను సవాల్‌ చేస్తూ న్యాయవాది సోమయాజులు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. పంచాయతీ భవనాలపై ఇప్పటికీ వైకాపా జెండాను పోలిన

Updated : 20 May 2020 17:15 IST

అమరావతి: గ్రామ పంచాయతీ కార్యాలయాల రంగుల అంశంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్‌ 623ను సవాల్‌ చేస్తూ న్యాయవాది సోమయాజులు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. పంచాయతీ భవనాలపై ఇప్పటికీ వైకాపా జెండాను పోలిన రంగులనే వేస్తున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. రంగుల క్రమం కూడా జెండాను పోలి ఉందని న్యాయస్థానానికి తెలియజేశారు. స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. భవనాలపై ఉన్న రంగులను తీసివేయమని గతంలోనే ఉత్తర్వులు జారీ చేశాం కదా? అని ప్రశ్నించింది. అయితే పంచాయతీ భవనాలకు వేస్తున్న రంగులు ఏ ఉద్దేశంతో వేస్తున్నామో పూర్తి వివరాలు ఉత్తర్వుల్లో పేర్కొన్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. గతంలో వేసిన రంగులతో పాటు అదనంగా మరో రంగు కలిపి వేస్తున్నట్లు వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని