సెక్షన్‌కు 40 మంది విద్యార్థులే: మంత్రి సురేష్‌

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్‌ ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి పలు నిబంధనలు సవరిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్‌ ప్రైవేటు కళాశాలల్లో ఒక్కో సెక్షన్‌లో పరిమిత సంఖ్యలో కేవలం 40 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలని

Updated : 28 May 2020 20:16 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్‌ ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి పలు నిబంధనలు సవరిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్‌ ప్రైవేటు కళాశాలల్లో ఒక్కో సెక్షన్‌లో పరిమిత సంఖ్యలో కేవలం 40 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరిస్తూ విద్యాశాఖ తాజాగా మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంస్కరణల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సీబీఎస్‌ఈ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసినట్లు చెప్పారు. సెక్షన్‌కు 40 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకునేలా పరిమితులు విధించినట్లు మంత్రి సురేశ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని