రాజేంద్రనగర్‌లోనే చిరుత

రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ పరిశోధనా విస్తరణ సంస్థ(మేనేజ్‌), గ్రేహౌండ్స్‌ ఫైరింగ్‌ శిక్షణ  ప్రాంతాల్లో ఇటీవల సంచరించి మాయమైన చిరుత మరోసారి

Updated : 03 Jun 2020 08:23 IST

సీసీ కెమెరాల్లో మళ్లీ కనిపించిన వైనం..ఆ ప్రాంతాల్లో భయం భయం

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ పరిశోధనా విస్తరణ సంస్థ(మేనేజ్‌), గ్రేహౌండ్స్‌ ఫైరింగ్‌ శిక్షణ  ప్రాంతాల్లో ఇటీవల సంచరించి మాయమైన చిరుత మరోసారి కనిపించింది. గ్రేహౌండ్స్‌ ఫైరింగ్‌ రేంజ్‌ పరిసరాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సోమవారం రాత్రి 11.14గంటలకు చిరుత తిరిగినట్లు గుర్తించారు. అది ప్రస్తుతం అటవీ ప్రాంతంలోనే ఉన్న కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. మరోసారి జనావాసాల్లోకి, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎన్‌ఐఆర్డీపీఆర్‌ తదితర సంస్థల ఆవరణలోకి వస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం అది మేనేజ్‌ ప్రహరీ పక్కన సంచరించినట్లు తెలుస్తోంది. తొలిసారిగా స్వల్పంగా గాయపడిన పరిస్థితిలో కాటేదాన్‌ వద్ద రహదారిపై కనిపించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అటవీ శాఖ అధికారులకు దొరక్కుండా తప్పించుకొని వెళ్లిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని