అసమాన ప్రజ్ఞాశాలి పీవీ: కేశవరావు

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

Updated : 24 Sep 2022 15:20 IST

హైదరాబాద్‌: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు వివిధ పార్టీల నేతలు... పీవీ చిత్రపటం వద్ద పుష్పాంజలిఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ ఛైర్మన్‌ కె.కేశవరావు మాట్లాడుతూ... సీఎంగా ఉన్నప్పుడు పీవీ భూసంస్కరణలు అమలు చేశారని గుర్తుచేశారు. 

నవోదయ విద్యాలయాలను తీసుకువచ్చిన ఘనత ఆయనదేనన్నారు. పేదలకు సమాజంలో గౌరవం, ఆత్మగౌరవం తీసుకొచ్చారని కొనియాడారు. బీసీల్లో రాజకీయ చైతన్యం, సాదికారత తెచ్చారని వివరించారు. ఆర్థిక సుస్థిరతకు ఆయన అందించిన నాయకత్వం సదా స్మరణీయమని పేర్కొన్నారు. అసమాన ప్రజ్ఞాశాలి పీవీ ఘనత చరిత్రలో నిలిచిపోతుందన్నారు.  పీవీ ఆశయాలు, సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. పీవీతో సన్నిహిత సంబంధాలున్న వారిని కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో పీవీ శతజయంతి ఉత్సవాలను విజయవంతం చేస్తామని కేశవరావు తెలిపారు.

సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, తెరాస పార్లమెంటరీ పక్ష నేత కేశవరావు, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని