పరవాడ ఘటనపై ఏపీ సీఎం ఆరా

పరవాడలోని సాయినార్‌ లైఫ్‌ సైన్సె్స్‌ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఆరా తీశారు. సీఎంఓ అధికారులను అడిగి ...

Published : 30 Jun 2020 08:52 IST

అమరావతి: పరవాడలోని సాయినార్‌ లైఫ్‌ సైన్సె్స్‌ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఆరా తీశారు. సీఎంఓ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ ఘటనలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఇద్దరు మృతి చెందారని, మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు సీఎంకు వివరించారు. ఒకరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, మరో ముగ్గురు సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. రియాక్టర్‌ వద్ద లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. రాత్రి 11.30గంటలకు ప్రమాదం జరిగిందని, వెంటనే జిల్లా కలెక్టర్‌, సీపీ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారని, ముందు జాగ్రత్తగా పరిశ్రమను షట్‌డౌన్‌ చేయించారని పేర్కొన్నారు. ప్రమాదం పరిశ్రమలో ఓ రియాక్టర్‌ ఉన్న విభాగానికి మాత్రమే పరిమితమని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు నివేదించారు. ఘటనపై విచారణ జరిపిస్తున్నట్టు కలెక్టర్‌ వెల్లడించారని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా సీఎం.. అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని