సచివాలయం కూల్చివేత: ట్రాఫిక్‌ మళ్లింపు

పాత సచివాలయం భవనాల కూల్చివేస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Published : 09 Jul 2020 17:20 IST

హైదరాబాద్‌: పాత సచివాలయం భవనాల కూల్చివేస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌పై రాకపోకలను నిలిపేశారు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ రహదారిపై వాహనాల రాకపోకలను నియంత్రించారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్, రవీంద్రభారతి, అంబేద్కర్ విగ్రహం కూడళ్లలో బారికేడ్లు ఏర్పాటు చేసి...  సచివాలయానికి వెళ్లే దారిని మూసేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని బోర్డులు పెట్టి పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని