GHMC: వ్యాపార, వాణిజ్య అనుమతులను వెంటనే పునరుద్ధరించుకోండి: రొనాల్డ్‌ రాస్‌

గడువు ముగిసిన వ్యాపార, వాణిజ్య అనుమతులను వెంటనే పునరుద్ధరించుకోవాలని నగరంలోని వ్యాపారులకు జీహెచ్ఎంసీ సూచించింది.

Published : 08 Jan 2024 22:34 IST

హైదరాబాద్‌: గడువు ముగిసిన వ్యాపార, వాణిజ్య అనుమతులను (trade license) వెంటనే పునరుద్ధరించుకోవాలని నగరంలోని వ్యాపారులకు జీహెచ్ఎంసీ (GHMC) సూచించింది. 2024 సంవత్సరానికి అనుమతుల పునరుద్ధరణతోపాటు కొత్త అనుమతులకూ దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. జనవరి 21లోగా ఎలాంటి జరిమానా లేకుండా అనుమతులు రెన్యువల్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు 25 శాతం, ఏప్రిల్ 1 తర్వాత 50 శాతం జరిమానా విధిస్తామని చెప్పారు.

మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనుమతి లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు గుర్తిస్తే.. వెంటనే ఆ వ్యాపారులకు 100 శాతం, ఆపై ప్రతి నెలా 10 శాతం జరిమానా విధిస్తామని కమిషనర్‌ హెచ్చరించారు. గ్రేటర్‌లోని వ్యాపారులందరూ తమ వ్యాపార అనుమతుల ధ్రువీకరణ పత్రం కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు సర్కిల్‌లోని మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేయని వ్యాపారులపై షెడ్యూల్ ప్రకారం జరిమానాలు ఉంటాయని కమిషనర్ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని