Anti Oxidents: ఆరోగ్యాన్నిచ్చే యాంటీ ఆక్సిడెంట్లతో మేలెంతో తెలుసా?

మన శరీరంలో ప్రీ రాడికల్స్‌ను ఎలా నియంత్రించాలి..? దానికున్న మార్గం ఒక్క యాంటీ ఆక్సిడెంట్లేనని వైద్యులు పేర్కొంటున్నారు.

Published : 02 Oct 2022 13:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన శరీరంలో నిత్యం ఎన్నో జీవక్రియలు జరుగుతాయి. ప్రీ రాడికల్స్‌ పెరగడంతో కణాల పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది. అయితే.. ఈ ప్రీ రాడికల్స్‌ను ఎలా నియంత్రించాలి? దానికున్న మార్గం ఒక్క యాంటీ ఆక్సిడెంట్లేనని వైద్యులు పేర్కొంటున్నారు. విటమిన్‌ సితో పాటు జింక్‌, సెలినీయం లాంటి పోషకాలుండే యాంటీ ఆక్సిడెంట్లు సహజంగానూ, కృత్రిమంగానూ లభిస్తాయని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్‌ అంజలీదేవి వివరించారు.

ఆహారమే ఇస్తుంది..!

యాంటీ ఆక్సిడెంట్లు ఆహారం ద్వారానే వస్తాయి. ఆకు కూరలు, కాయగూరలు, పండ్లలోనే ఇవి లభిస్తాయి. వీటిని నిత్యం తీసుకోవడంతో ప్రీ రాడికల్స్‌ను నియంత్రించడానికి వీలవుతుంది. లేకపోతే అనారోగ్య సమస్యలు చాలా వస్తాయి. గుండె జబ్బులతో పాటు క్యాన్సర్‌, మధుమేహం లాంటి దాదాపు 60 రకాల వ్యాధులను తెస్తాయని నిపుణులు గుర్తించారు.  ఎక్కువగా క్యారెట్‌, క్యాబేజీ, టమాట, ఉల్లి, దుంపలు, బీన్స్‌, చిక్కుళ్లు, యాపిల్‌, దానిమ్మ, ద్రాక్ష, బొప్పాయి, గ్రీన్‌ టీ, ఆలీవ్‌ ఆయిల్, తెనే లాంటి వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని