Vitamin b12: ‘విటమిన్‌ బి-12’ లోపించిందా! వీటిని ఆహారంగా తీసుకోండి!

మన వంటింట్లో ఉండే ఆహారమే అయినా మనకు ఏ ఆహారంలో ఏ పోషక విలువలు ఉన్నాయో తెలియదు. 

Published : 02 May 2022 01:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన వంటింట్లో ఉండే ఆహారమే అయినా మనకు ఏ ఆహారంలో ఏ పోషక విలువలు ఉన్నాయో తెలియదు. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. మనకు అందుబాటులోనే ఉండి అత్యంత పోషకాలు కలిగిన ఆహార పదార్థాలేవో తెలుసుకుందామా! 

‘విటమిన్‌ బి-12’ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇది లోపించినట్లయితే మెగా లోబ్లాస్టిక్‌ అనీమియా(రక్త హీనత)కు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ విటమిన్‌ ఎక్కువగా జంతువుల నుంచి ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలలో ఎక్కువగా ఉంటుంది. 

పెరుగు: విటమిన్‌-12 పుష్కలంగా దొరికే వాటిల్లో పెరుగు ఒకటి. రోజులో కావాల్సిన విటమిన్‌-12 ఒక కప్పు పెరుగులో 28శాతం లభిస్తుంది. విటమిన్‌ లోపంతో బాధపడుతున్నవారు రోజూ పెరుగును ఆహారంతో పాటు తీసుకోవడం మంచిది.

పోషకాలున్న ఈస్ట్‌: పోషకాలున్న ఈస్ట్‌ ఒక చెంచాలో 5ఎమ్‌సీజీ విటమిన్‌-12 ఉంటుంది. ఈ ఈస్ట్‌ను పాప్‌కార్న్‌, గిలకొట్టిన గుడ్లు, సూపులు, పాస్తాలలో కలుపుకుని తీసుకోవచ్చు.

పాలు: ఒక కప్పు పాలలో రోజుకి కావాల్సిన కాల్షియం 20శాతం ఉంటుంది. రోజూ పాలు తాగడం వల్ల విటమిన్‌-12ను శరీరానికి అందించవచ్చు.

తృణధాన్యాలు: తృణధాన్యాలు అన్ని రకాలుగా శరీరానికి మేలు చేస్తాయి. ఒక కప్పు తృణధాన్యాలను ఉదయం అల్పాహారంగా తీసుకోవాలి. దీంతో విటమిన్‌-12 పొందేందుకు వీలుంటుంది. ఓట్స్‌ ఫ్లేక్స్‌, కార్న్‌ఫ్లేక్స్‌ తీసుకోవటం మంచిది. 

సోయా పన్నీర్‌: టోఫుల గురించి విన్నారా! అవునండీ సోయా పాలతో చేసిన టోఫుల్లో విటమిన్-12 పుష్కలంగా దొరుకుతుంది. దీనిని బీన్‌ పెరుగు అని కూడా అంటారు. చపాతీ, అన్నంలోకి రుచిగా ఉంటుంది. లేదా నూనెలో వేయించి సలాడ్‌లో కూడా కలిపి తీసుకోవచ్చు. వీటిని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి. తద్వారా విటమిన్‌-12 సమస్యను అధిగమించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని