AP High Court: ప్రత్తిపాటి శరత్‌ పోలీసు కస్టడీకి హైకోర్టు నిరాకరణ

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది.

Published : 13 Mar 2024 14:52 IST

అమరావతి: తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. పోలీసులు వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. డొల్ల కంపెనీలు సృష్టించి వాటి ద్వారా పెద్దఎత్తున సొమ్ము దారి మళ్లించారనే ఆరోపణలతో ఇటీవల ప్రత్తిపాటి శరత్‌ను అరెస్టు చేశారు. అవెక్సా కంపెనీ బ్యాంకు ఖాతా నుంచి ఎల్లో స్టోన్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ప్రత్తిపాటి ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఖాతాలకు పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ సంస్థల్లో ప్రత్తిపాటి స్వాతి, ప్రత్తిపాటి వెంకాయమ్మ, ప్రత్తిపాటి శరత్‌ డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ క్రమంలో శరత్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఇటీవల పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. బుధవారం ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు