KVS exam: కేవీల్లో ఉద్యోగ నియామక పరీక్ష తేదీల్లో మార్పు.. కొత్త తేదీలివే..!

కేంద్రీయ విద్యాలయాల్లో 13వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి కొనసాగుతున్న కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. 

Updated : 09 Feb 2023 19:02 IST

దిల్లీ: దేశంలోని కేంద్రీయ విద్యాలయాల్లో (Kendriya Vidyalaya) భారీగా టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ నిర్వహిస్తోన్న కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. వివిధ విభాగాల్లో మొత్తంగా 13,404 పోస్టులను భర్తీ చేసేందుకు దశల వారీగా ఈ నెల 7నుంచి ప్రారంభమైన ఈ పరీక్షల షెడ్యూల్‌ను సవరిస్తున్నట్టు కేవీఎస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పరీక్ష తేదీలను సవరించినట్టు పేర్కొంది. సవరించిన తేదీలు, షిఫ్టుల జాబితాను  విడుదల చేసింది. ఇప్పటివరకు అసిస్టెంట్‌ కమిషనర్‌ పేపర్‌ 1; పేపర్‌ 2లతో పాటు ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌, పీఆర్‌టీ మ్యూజిక్‌ పోస్టులకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయి. పూర్తి వివరాలను kvsangathan.nic.inలో తెలుసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని