Botsa: రాజధానిపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుంది: మంత్రి బొత్స

విభజన చట్టంలోని అంశాలను సాధించడమే తమ పార్టీ విధానమని, రాష్ట్రానికి చట్టపరంగా రావాల్సిన వాటి గురించే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Updated : 14 Feb 2024 17:31 IST

విశాఖ: విభజన చట్టంలోని అంశాలను సాధించడమే తమ పార్టీ విధానమని, రాష్ట్రానికి చట్టపరంగా రావాల్సిన వాటి గురించే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌.. పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అన్నారు. పదేళ్లు పూర్తయ్యాక రాజధానిపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుంది. పాలనా రాజధానిగా విశాఖను చేద్దామంటే అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల బకాయిలపై మంత్రి స్పందిస్తూ.. గత ప్రభుత్వాలు ఎప్పుడూ బకాయిలు పెట్టలేదా? అని ప్రశ్నించారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లకూడదని తాము కోరుకుంటున్నామన్నారు. ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని