Polavaram: పోలవరంపై కేంద్రం మరో మెలిక..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. మరోసారి సామాజిక, ఆర్థిక సర్వేను

Published : 25 Mar 2022 13:07 IST

దిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. మరోసారి సామాజిక, ఆర్థిక సర్వేను నిర్వహించాలని రాష్ట్రానికి షరతు విధించింది. లోక్‌సభలో వైకాపా ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌పై డీపీఆర్‌ తయారు చేయాల్సిందేనని నిబంధన విధించినట్లు జల్‌శక్తి శాఖ పేర్కొంది. 

పోలవరం నిర్మాణంలో ప్రస్తుతానికి రూ.15,668 కోట్ల వరకే తమ బాధ్యతని.. ఫిబ్రవరి 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.14,336 కోట్లని కేంద్రం తెలిపింది.  రాష్ట్ర ప్రభుత్వానికి ₹12,311 కోట్లు తిరిగి చెల్లించామని.. రూ.437 కోట్లకు పోలవరం అథారిటీ బిల్లులు పంపిందని జల్‌శక్తి శాఖ వివరించింది. పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తిచేస్తారో గడువు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలతో పోలవరం నిర్మాణం మరింత ఆలస్యమయ్యే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని