Hyderabad: చార్మినార్‌కు మల్టీకలర్‌ లైటింగ్‌.. ప్రారంభించిన కిషన్‌రెడ్డి

రాత్రి సమయాల్లో చార్మినార్‌ మరింత సుందరంగా కనిపిచేందుకు కేంద్ర పర్యాటకశాఖ చర్యలు చేపట్టింది. 

Published : 05 Aug 2023 21:43 IST

హైదరాబాద్‌: భాగ్యనగరం పేరు చెప్పగానే గుర్తొచ్చేది చార్మినార్‌. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఈ పురాతన కట్టడానికి నిత్యం వేలాది మంది సందర్శకులు తరలివస్తుంటారు. రాత్రి సమయాల్లో చార్మినార్‌ మరింత సుందరంగా కనిపిచేందుకు కేంద్ర పర్యాటకశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చార్మినార్‌కు మల్టీకలర్‌ లైటింగ్‌ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్ర మంత్రి దర్శించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని