
Updated : 17 Jan 2022 14:49 IST
Nara Lokesh: నారా లోకేశ్‌కు కరోనా పాజిటివ్
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొవిడ్ బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు ట్విటర్ ద్వారా లోకేశ్ వెల్లడించారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనని కలిసిన వారు తొందరగా టెస్టులు చేయించుకోవాలని.. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ క్షేమంగా ఉండాలని లోకేశ్ పేర్కొన్నారు.
Tags :