బర్డ్‌ఫ్లూ.. ఆ ప్రాంతంలో 3 నెలలు చికెన్‌ షాపులు మూసేయాలి: నెల్లూరు కలెక్టర్‌

జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ హరినారాయణ్‌ ఆదేశించారు.

Updated : 16 Feb 2024 04:02 IST

నెల్లూరు: జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ హరినారాయణ్‌ ఆదేశించారు. వ్యాధి ప్రబలకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ‘‘పొదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో కోళ్లు చనిపోయాయి. కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10 కి.మీ పరిధిలో 3 రోజులు చికెన్‌ షాపులు మూసేయాలి. ఒక కిలోమీటర్‌ పరిధిలో మూడు నెలల వరకు షాపులు తెరవకూడదు. చనిపోయిన వాటిని భూమిలో పాతిపెట్టాలి.. పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ 2 గ్రామాల్లో డీపీవో, జిల్లా పరిషత్‌ సీఈవో గ్రామసభలు నిర్వహించాలి. ప్రజలు, కోళ్ల పెంపకందారులు, చికెన్‌ షాప్‌ యజమానుల్లో చైతన్యం తేవాలి. ఆయా గ్రామాల పరిధిలో శానిటైజేషన్‌ చేయించాలి’’ అని కలెక్టర్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని