డ్రోన్ల ప్రదర్శనతో 2020కి వీడ్కోలు
స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. 2020కి వీడ్కోలు పలుకుతూ నిర్వహించిన డ్రోన్ల విన్యాసాలు కట్టిపడేశాయి.
ఎడిన్బర్గ్: స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. 2020కి వీడ్కోలు పలుకుతూ నిర్వహించిన డ్రోన్ల విన్యాసాలు కట్టిపడేశాయి. వందలాది డ్రోన్లతో గగన తలంలో వైవిధ్యమైన ఆకృతులను ఏర్పాటు చేస్తూ నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో ఏటా కొత్త ఏడాదికి ముందు నిర్వహించే హోగ్మనే వేడుకలు ఈసారి కరోనా మహమ్మారి వల్ల ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఏటా మూడు రోజుల పాటు జరిగే నూతన సంవత్సర స్వాగత వేడుకలకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యేవారు. కరోనా కారణంగా ఈసారి వేడుకలు వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఎడిన్బర్గ్ ప్రాంతంలో నిర్వహిస్తున్న డ్రోన్ ప్రదర్శనలు వీనులకు విందు చేస్తున్నాయి. కృత్రిమ మేధతో నిర్మించిన 150 డ్రోన్లు గంటకు 25మైళ్ల వేగంతో కదులుతూ ప్రదర్శనలో పాల్గొన్నాయి.
మిరుమిట్లు కొలిపే వెలుగులతో జంతువులు, జలచరాలు సహా వివిధ క్రమ పద్ధతులతో డ్రోన్లను అమర్చిన తీరు ఆకట్టుకుంటోంది. యూకేలో ఇప్పటి వరకు జరిగిన డ్రోన్ల ప్రదర్శనల్లో ఇదే పెద్దది. వివిధ రంగులను వెదజల్లే టార్చ్‌లను డ్రోన్లకు అమర్చడం వల్ల ప్రదర్శన మరింత ఆకర్షణీయంగా మారింది. కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు ఈ ప్రదర్శనను అంకితం చేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రితో ఈ హోగ్మనే పండుగ ముగుస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్‌పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?