Telangana News: వాణిజ్య పంటలపై రైతులు దృష్టి సారించాలి: నిరంజన్‌రెడ్డి

దేశానికి అన్నం పెట్టే రైతులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వర్షాకాలం సాగు సన్నద్ధతపై నల్గొండలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో నిరంజన్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

Updated : 01 Jun 2022 17:04 IST

నల్గొండ: దేశానికి అన్నం పెట్టే రైతులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వర్షాకాలం సాగు సన్నద్ధతపై నల్గొండలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో నిరంజన్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు. వాణిజ్య పంటలపై రైతులు దృష్టి సారించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. రాష్ట్రంలో బీడు భూములన్నీ పచ్చగా మారాయని.. తెలంగాణలో గతేడాది 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని చెప్పారు. ప్రజల జీవన విధానంలో, ఆహారంలో అనేక మార్పులొచ్చాయని.. వాటికి అనుగుణంగా రైతులు తృణధాన్యాలు, ఉద్యాన పంటల సాగు వైపు వెళ్లాలన్నారు.

‘‘ప్రస్తుతం నూనె గింజల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో నూనె గింజల సాగు పెరగాలి. 10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాం. ఆయిల్‌ పామ్‌లో 168 రకాల ఉప ఉత్పత్తులు ఉంటాయి. ఇండోనేషియా, మలేషియాలో ఆయిల్‌పామ్‌ సాగుతో మంచి ఆదాయం వస్తోంది. తెలంగాణలో వ్యవసాయానికి అన్ని రకాల వసతులు ఉన్నాయి. రైతులు భిన్నమైన పంటలు వేసే విధంగా ప్రణాళికలు వేయాలి’’ అని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని