TS News: రాష్ట్రంలో ఒక్కరోజే 12 ఒమిక్రాన్‌ కేసులు

తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా సోమవారం ఒక్కరోజే 12 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం

Updated : 27 Dec 2021 22:27 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా సోమవారం ఒక్కరోజే 12 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య  55కి పెరిగింది. నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన వారిలో 10మందిలో ఈ కొత్త వేరియంట్‌ వెలుగు చూడగా.. మరో ఇద్దరు కాంటాక్టు వ్యక్తుల్లో ఈ వైరస్‌ని గుర్తించారు. ఒమిక్రాన్‌ బాధితుల్లో ఇప్పటివరకు 10మంది కోలుకున్నారు.

మరోవైపు, రాష్ట్రంలో గడిచిన 24గంటల వ్యవధిలో 182 కొవిడ్‌ కేసులు, ఒక మరణం నమోదయ్యాయి. 181మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3417 క్రియాశీల కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.90శాతంగా ఉండగా.. మరణాల రేటు 0.59శాతంగా ఉందని ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. మరోవైపు, మెట్‌పల్లిలో షార్జా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఒమిక్రాన్‌ పరీక్ష కోసం హైదరాబాద్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని