బుద్ధి నేర్పాలని ఐలాండ్‌లో వదిలేశారు!

పిల్లలు తప్పులు చేయడం.. మొండిగా ప్రవర్తించడం మామూలే. కొంతమంది తల్లిదండ్రులు చక్కగా పక్కన కూర్చొబెట్టుకొని నచ్చచెప్తారు. మరికొందరు కొట్టి దారిలోకి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తారు. అయితే, కొన్ని దేశాల్లో పిల్లల్ని కొట్టడం నేరంగా పరిగణిస్తే.. మరికొన్ని దేశాల్లో పిల్లల్ని శిక్షిస్తే గానీ దారిలోకి

Published : 17 Jul 2021 01:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లలు తప్పులు చేయడం.. మొండిగా ప్రవర్తించడం మామూలే. కొంతమంది తల్లిదండ్రులు చక్కగా పక్కన కూర్చొబెట్టుకొని నచ్చజెప్తారు. ఇంకొందరు కొట్టి దారిలోకి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తారు. మరికొందరు మాత్రం మరింత గట్టిగా బుద్ధి చెప్పాలని అనుకుంటారు. అలాంటిదే ఈ చైనా జంట. తమ కుమార్తెకు బుద్ధి చెప్పాలని భావించి ఆమెను ఏకంగా ఓ నిర్మానుషమైన ఓ ఐలాండ్‌లో వదిలేసి వెళ్లిపోయారు. 

షాండాంగ్‌ ప్రావిన్స్‌కు చెందిన 13 ఏళ్ల చిన్నారి తల్లిదండ్రులు చెప్పిన మాట వినట్లేదట. పాఠశాలకు వెళ్లడం మానేసి ఇంట్లోనే ఉండడాన్ని చిన్నారి తల్లిదండ్రులు సహించలేకపోయారు. దీంతో ఎలాగైనా ఆ చిన్నారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే రుషాన్‌ పట్టణానికి సమీపంలో ఉన్న ఎడారిలాంటి ఒక ఐలాండ్‌కు తీసుకెళ్లి ఒంటరిగా వదిలేసి వచ్చారు. ఆ చిన్న ఐలాండ్‌లో జనావాసం లేదు. చాలాకాలంగా నిర్మానుషంగా ఉంటోంది. అందుకే, చిన్నారిని అక్కడ వదిలేసి, ఆమెను గమనించడానికి మరో సర్వైవల్‌ ఎక్స్‌పర్ట్‌ను నియమించి వెళ్లారు. దీంతో బిక్కుబిక్కుమంటూ ఆ చిన్నారి ఐలాండ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. తల్లిదండ్రులు ఇచ్చిన వాటర్‌ బాటిల్‌ నీళ్లు.. బిస్కెట్స్‌ తింటూ రెండ్రోజులపాటు అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత అటువైపుగా వెళ్తున్న మత్స్యకారులు ఆమెను గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఐలాండ్‌ చేరుకొని ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి చిన్నారిని వారికి అప్పగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని