Pet dog Birthday:రూ. 7 లక్షలతో శునకం బర్త్‌ డే.. యజమాని అరెస్ట్‌

నేటికాలంలో చాలామంది కుక్కులు, పిల్లులను పెంచుకుంటున్నారు. వాటిని తమ కుటుంబసభ్యుల్లో ఒకరిగా చూసుకునేవారూ ఉన్నారు. పెంపుడు జంతువుల పుట్టినరోజులను కూడా ఘనంగా నిర్వహిస్తూ తమ హోదాను

Updated : 09 Jan 2022 19:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నేటికాలంలో చాలామంది కుక్కలు, పిల్లులను పెంచుకుంటున్నారు. వాటిని తమ కుటుంబసభ్యుల్లో ఒకరిగా చూసుకునేవారూ ఉన్నారు. పెంపుడు జంతువుల పుట్టినరోజులను కూడా ఘనంగా నిర్వహిస్తూ తమ హోదాను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే ఇప్పుడు ముగ్గురిని ఇబ్బందుల్లోకి నెట్టింది. కొవిడ్‌-19 మార్గదర్శకాలను పాటించకుండా పెంపుడు కుక్క పుట్టినరోజును చేసినందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. 

వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌లోని కృష్ణానగర్ ప్రాంతంలోని కిరణ్‌పార్క్ సొసైటీకి చెందిన చిరాగ్ పటేల్ తన పెంపుడు శునకం (అబ్బే) బర్త్‌ డేను రూ.7 లక్షలు ఖర్చుచేసి ఘనంగా నిర్వహించాడు. భారీ ప్లెక్సీలు, రంగు రంగుల లైటింగ్ సిస్టమ్‌, డీజే.. ఇలా పెద్ద పార్టీ వాతావరణాన్నే క్రియేట్‌ చేశాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన చర్యలను ఏ మాత్రం ఎక్కడా పాటించలేదు. ఆ వేడుకకు హాజరైన వాళ్లు భౌతికదూరం పాటించకుండా, కనీసం మాస్కులు కూడా ధరించకుండా పెద్ద హంగామా చేశారు. ఈ బర్త్‌ డే పార్టీకి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇవి కాస్త పోలీసుల కంటపడ్డాయి. ఈ బర్త్‌ డే పార్టీని ఏర్పాటుచేసిన చిరాగ్ పటేల్‌తోపాటు అతని సోదరుడు ఉర్విశ్‌ పటేల్, దివ్యేష్ మెహరియా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వీరిపై కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులను నమోదు చేశారు. అనంతరం ముగ్గురికి బెయిల్‌ మంజూరు చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని