CM KCR: కేసీఆర్‌.. మీరు ఆరోగ్యంగా ఉండాలి: ఫోన్‌ చేసి విష్ చేసిన ప్రధాని

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎంవోను ట్యాగ్‌ చేస్తూ.. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు...

Updated : 17 Feb 2022 13:32 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎంవోను ట్యాగ్‌ చేస్తూ.. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరెప్పుడూ ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నా’’ అని ట్వీట్‌ చేశారు. అంతేగాక, స్వయంగా ప్రధాని మోదీ కేసీఆర్‌కు ఫోన్‌ చేసిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా సీఎంకు విషెస్‌ తెలిపారు.

‘‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సదా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.’’ - తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు

‘‘గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ లక్ష్యసాధన, ప్రజాసేవకు ఆ భగవంతుడు మీకు అపరిమిత శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.’’ - నటుడు చిరంజీవి

‘‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నా.’’ - అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ

‘‘గొప్ప వాక్పటిమ, ముందు చూపు కలిగిన రాజకీయ పోరాటయోధుడు కేసీఆర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రానికి ఎంతటి జఠిలమైన సమస్య ఎదురైనా తన మాటలతో ప్రజలకు సాంత్వన చేకూర్చడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన రాజకీయ ప్రయాణం, తెలంగాణ సాధనలో తనదైన పోరాటం కేసీఆర్‌ని తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతాయి.’’ - జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

‘‘గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ - భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

 






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని