Ponnam Prabhakar: టీఎస్‌ కాదు టీజీ.. రేపటి నుంచే అమలు

ప్రజల మనోభావాల మేరకు తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్లేట్లపై టీఎస్‌ను టీజీగా మారుస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు.

Published : 14 Mar 2024 16:24 IST

హైదరాబాద్‌: ప్రజల మనోభావాల మేరకు తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్లేట్లపై టీఎస్‌ను టీజీగా మారుస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. శుక్రవారం (మార్చి 15) నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు అన్నీ ఇకపై టీజీగా వస్తాయని ప్రకటించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను అణచివేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం టీజీ అని రాసుకున్నాం. శాసనసభ ఆమోదంతో టీఎస్‌ను టీజీగా మార్చాలని కేంద్రానికి పంపించాం. అందుకు ఆమోదం లభించింది. గత ప్రభుత్వం మాదిరిగా.. జీవోలను రహస్యంగా ఉంచాలనుకోవడం లేదు’’ అని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు