‘మేం ఓట్లు అమ్ముకోం.. మా ఇంటికి రావొద్దు’

మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి.

Updated : 08 May 2024 07:22 IST

గోడప్రతులు ఏర్పాటు చేసిన రేఖా కృష్ణార్జునరావు

మంగళగిరి, తాడేపల్లి, న్యూస్‌టుడే: మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి. ఈ క్రమంలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మంగళగిరి బుద్ధవిహార్‌ అధ్యక్షుడు రేఖా కృష్ణార్జునరావు, చైతన్య సాహితీ వేదిక కన్వీనర్‌ గోలి మధు తమ ఇళ్ల గోడలపై ఏర్పాటు చేసిన ప్రతులు ఆలోచింపజేస్తున్నాయి. ‘మేం ఏనాడూ ఓటును అమ్ముకోలేదు. రాజ్యాంగాన్ని మార్చాలని భావించే పార్టీ అభ్యర్థులు, ఓట్లు కొనాలనుకునేవారు మా ఇంటికి రానవసరం లేదు’ అని వాటిపై పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని