Droupadi Murmu: ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనం అద్భుతం: రాష్ట్రపతి

విశ్వ శాంతి, మానవ కల్యాణం కోసం సాగుతున్న ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనం అద్భుతమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. 

Updated : 15 Mar 2024 23:32 IST

హైదరాబాద్: విశ్వ శాంతి, మానవ కల్యాణం కోసం సాగుతున్న ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనం అద్భుతమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక భావనలు పెరిగితేనే భేదభావాలు లేకుండా.. ప్రపంచం వసుదైక కుటుంబంగా ఉంటుందని తెలిపారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ, హార్ట్‌ఫుల్‌నెస్‌ సంయుక్త ఆధ్వర్యంలో.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హశాంతి వనంలో జరిగిన ఆధ్యాత్మిక మహోత్సవ్‌లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా విభిన్న మతాలు, సంప్రదాయాలు అనుసరించే గురువులు, స్వామీజీలంతా ఈ వేదికపైకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘావాల్, హార్ట్‌ఫుల్‌నెస్‌ గ్లోబల్‌ గైడ్‌ కమలేష్‌ డి పటేల్‌, చినజీయర్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని