Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. స్తంభించిన ట్రాఫిక్‌

నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దీంతో ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు.

Updated : 08 Oct 2022 20:13 IST

హైదరాబాద్‌: నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. గచ్చిబౌలి, సనత్‌నగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, మైత్రివనం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మియాపూర్‌, శేరిలింగంపల్లి, మాదాపూర్‌, రాయదుర్గం, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, అల్విన్‌కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, రాజేంద్రనగర్‌, కిస్మత్‌పూర్‌, గండిపేట, ఉప్పరపల్లి, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట్‌, అల్వాల్‌, చిలకలగూడ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం బయటికి వచ్చిన ప్రజలు తడిసి ముద్దయ్యారు. రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కనిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని